బహ్రెయిన్: 40 ఏళ్లు మించిన వారికి బూస్టర్ షాట్..80% లక్ష్యం
- July 31, 2021
బహ్రెయిన్: కోవిడ్ వేరియంట్ల నుంచి దేశ ప్రజలను రక్షించుకునేందుకు వీలైనంత ఎక్కువ మందికి బూస్టర్ షాట్ అందించే లక్ష్యంతో నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. 40 ఏళ్లు అంతకుమించిన వయసు వారిలో కనీసం 80% మందికి బూస్టర్ షాట్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే దాదాపు 95,000 మందికి బూస్టర్ షాట్ ఇవ్వాల్సి ఉంటుంది. బూస్టర్ షాట్ పొందేందుకు అన్ని అర్హతలు ఉండి 40 ఏళ్లకు మించి వయసు వారు బహ్రెయిన్‌లో 2,50,000 మంది ఉన్నారు. ఇందులో 1,05,000 మంది ఇప్పటికే బూస్టర్ షాట్ తీసుకున్నారు. మిగిలిన వారిలో దాదాపు 95 వేల మందికి ఈ విడతలో బూస్టర్ డోస్ ఇవ్వాలన్నది నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ టార్గెట్. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచుతూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రొత్సహిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







