ప్రయాణికులకు దుబాయ్ ఎక్స్ పో 2020 డే పాస్..ఎమిరేట్స్ ఆఫర్
- July 31, 2021
దుబాయ్: తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వరల్డ్ గ్రేటెస్ట్ షోలో పాల్గొనే ఆఫర్ ప్రకటించింది ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్. ప్రతి ప్రయాణికుడికి ఒక్కో డే పాస్ ను కాంప్లిమెంటరీగా అందించనున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. అంతేకాదు..దుబాయ్ మీదుగా ప్రయాణించే వారికి కూడా దుబాయ్ ఎక్స్ పో పాస్ లు పొందే అవకాశం కల్పించింది. కనెక్షన్ ఫ్లైట్ కోసం దుబాయ్ లో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణికులు అందరికి కాంప్లిమెంటరీ పాస్ లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పో కోసం దుబాయ్ సిద్ధం అవుతోంది. మరో మూడు నెలల్లో షో షురూ కానుంది.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







