'సర్కారువారి పాట' ఫస్ట్ నోటీస్ వచ్చేసింది
- July 31, 2021
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్‌స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్ రానే వచ్చింది. మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారువారి పాట' నుంచి 'ఫస్ట్ నోటీస్' అంటూ మహేష్ లుక్‌ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో మహేశ్ అదిరిపోయాడు. పోకిరి, అతిధి చిత్రాల తర్వాత పొడవాటి జుట్టుతో మహేష్ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా మెడపై రూపాయి కాయిన్ టాటూతో, ఎరుపు రంగు కారులోని నుంచి మహేశ్ స్టైలిష్ గా దిగుతున్నట్టుగా లుక్ ఉంది. కారు వెనుక బైక్‌లపై రేసర్లు కనిపిస్తున్నారు. ఈ లుక్‌ని చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









