రమదాన్ సందర్భంగా ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
- June 04, 2015
రమదాన్ సందర్భంగా రహదార్లపై ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా ఉండేందుకు అబుదాబీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది గనుక వాహనాల్లో ప్రయాణించేవారు నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల్ని నడిపాలని పోలీసులు సూచించారు. వాహనదారులే కాకుండా, రోడ్లపై నడిచేవారు కూడా ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాల్సి ఉందని చీఫ్ ట్రాఫిక్ కంట్రోల్ సెక్షన్ లెఫ్టినెంట్ కల్నల్ మహమ్మద్ అల్ షెహ్హీ చెప్పారు. ఎక్కడబడితే అక్కడ వాహనాల్ని పార్కింగ్ చేయడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే అవుతుందన్నారు. మసీదుల్లో ప్రార్థనా సమయాల్లో పక్కనే ఉండే రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు ట్రాఫిక్ విభాగం తీసుకుంటుందన్నారు అల్ షహ్హీ. పరిమిత వేగంతో వాహనాలు నడపడం మంచిదని సూచిస్తూ, సిగ్నలింగ్ లైట్స్ సరిగ్గా వినియోగించాలని వాహనదారుల్ని కోరింది ట్రాఫిక్ పోలీస్ విభాగం.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







