ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్
- August 02, 2021ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మళ్లీ వినియోగదారుల ముందుకు రానుంది.ఇప్పటికే గత నెల 27, 29 తేదీల్లో ఉన్న ఈ సేల్‌లో ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకున్నారు కస్టమర్లు.ఇప్పుడు తాజాగా ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్‌తో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.ఈ సేల్‌లో భాగంగా కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది.ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు,ఇతర ఎలక్ట్రానిక్స్‌పై గొప్ప తగ్గింపును ఇస్తోంది. అలాగే క్రెడిట్ కార్డులపై కూడా రాయితీలు ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్. ఐసీఐసీ, యాక్సిస్ కార్డుదారులకు సుమారు 10శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అయితే మరోసారి వినియోగదారుల ముందుకు వచ్చే బిగ్ సేవింగ్ సేవింగ్ డేస్ ఖచ్చితమైన తేదీలను వెల్లడించకపోయినా.. వెబ్‌సైట్‌లో ఓ సమాచారం ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు అని సూచిస్తోంది.
గత నెలలో ఉన్న ఈ సేల్స్‌లో మొబైల్ ఫోన్‌లపై ఎన్నో ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా ఆఫర్లు ప్రకటించింది. ఈఎంఐ ఆప్షన్‌లో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది. తాజాగా ప్రకటించే ఆఫర్లలో ఎలక్ట్రానిక్ పై 50 శాతం వరకు డిస్కౌంట్, మొబైల్ ఫోన్‌లపై 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్, ఎక్ఛేంజ్ ఆఫర్, టీవీలు, ఇతర ఉపకరణాలు కనీసం 60 శాతం వరకు డిస్కౌంట్, ల్యాప్‌టాప్‌లకు 35 నుంచి 50 శాతం వరకు బ్యాంకు కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము