కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తమిళంలో రీమేక్
- March 12, 2016
సినిమా ఓ భాషలో హిట్ అయితే దాని రీమేకి హక్కుల కోసం పోటీ పడటం మాములే. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు తమిళ, హింది భాషల్లోవి ఇక్కడ.. ఇక్కడవి అక్కడకు రీమేక్ చేసి హిట్ సాధించాయి కూడా. అయితే ఇప్పుడు అదే దారిలో తెలుగులో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా తమిళంలో రీమేక్ అవుతుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ లాస్ట్ ఇయర్ నందమూరి నామ సంవత్సరానికి నాంధి పలికింది. ఎటువంటి అంచనాలేమి లేకుండా సైలెంట్ గా వచ్చిన కళ్యాణ్ రామ్ పటాస్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక ఆ సినిమాను ఆల్రెడీ కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ సినిమాను తమిళంలో లారెన్స్ హీరోగా చేస్తుండటం విశేషం. మొట్ట శివ కట్ట శివ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమలో లారెన్స్ కోసం అక్కడ కథలో కొన్ని మార్పులు చేసి రెండు విభిన్న పాత్రలు సృష్టించడం జరిగిందట. తమిళ్ లో లారెన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ గుడ్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తమిళంలో ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుంది. పటాస్ లో సాయి కుమార్ చేసిన పవర్ఫుల్ రోల్ తమిళంలో సత్యరాజ్ చేస్తున్నారు. కొద్దికాలంగా హారర్ కథాంశాలతోనే ప్రేక్షకులను అలరిస్తున్న లారెన్స్ పటాస్ తో కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు. సాయి రమణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృష్ణాష్టమి బ్యూటీ నిక్కి గర్లాని హీరోయిన్ గా నటిస్తుంది. మరి మెట్ట శివ కెట్ట శివగా షాక్ ఇస్తున్న లారెన్స్ తమిబిల తంబీల నుండి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







