ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆశాకిరణo ప్రధాన మంత్రి
- March 12, 2016
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆసియా దేశాలు ఆశాకిరణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం దిల్లీలో జరిగిన అడ్వాన్సింగ్ ఏసియా సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా... అభివృద్ధి శాతం అగ్రదేశాలకంటే ఆసియాలో మూడు రెట్లు అధికంగానే ఉందన్నారు. పరస్పర సహకారం, నమ్మకంతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ.. ఈ విషయంపై భారత్‌కు పూర్తి విశ్వాసముందని వెల్లడించారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు * 21వ శతాబ్దం ఆసియాదేనని చాలా మంది విజ్ఞానవంతులు చెబుతున్నారు.* సంస్కరణలు అనేవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. * ప్రపంచ వ్యాప్త సంస్థల్లో సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ * ఆసియాలో భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. చరిత్రాత్మకంగా భారత్ ఎన్నో విధాలుగా ఆసియాకు తోడ్పడింది. * భారత్‌లో వ్యవసాయంపై అనేక జీవితాలు ఆధారపడి ఉన్నాయి. రైతు ఆదాయం రెట్టింపు కావాలన్నదే మా ప్రధాన లక్ష్యం. ఇందుకు గ్రామీణ, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచాం. * ఐఎంఎఫ్ కోటాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపకూడదు. * బహుళ సంస్కృతుల అంశంలో భారత్‌కు గొప్ప నమ్మకం ఉంది. * ఎకనమిక్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచాం. * అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశాం. * ఆసియాలో ఉన్న మరో విశిష్టత ఏమిటంటే.. ఈ ఖండం నుంచి పెద్ద సంఖ్యలో మహిళా దేశాధినేతలు ఉద్భవించారు. * ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండోనేషియా, థాయిలాండ్, కొరియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ ఈ అన్ని దేశాల్లో జాతీయ నేతలుగా మహిళలు పాలన కొనసాగించారు. * ఇతర ఖండాలతో పోలిస్తే ఆసియాలోనే మహిళా దేశాధినేతలు ఎక్కువ * భారత్‌లో నాలుగు పెద్ద రాష్ట్రాలైన బంగాల్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడులో మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. * ఆసియాలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. చరిత్ర చూస్తే ఆసియాకు భారత్ అనేక విధాలుగా సహాయపడింది. * బౌద్ధమతం భారత్ నుంచే చైనా, జపాన్, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







