టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచాలి: ఈవో జవహర్ రెడ్డి

- August 03, 2021 , by Maagulf
టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచాలి: ఈవో జవహర్ రెడ్డి

తిరుపతి: తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్రం ఆయన మందులు, వైద్య పరికరాల కొనుగోలు విధానం పై సమీక్ష నిర్వహించారు.
స్విమ్స్ లో మందులు, పరికరాల కొనుగోలు కోసం టెండర్లు నిర్వహిస్తున్న విధానం తెలుసుకున్నారు. టెండర్ కాల పరిమితి పూర్తి కావడానికి నాలుగు నెలల ముందు నుంచే మళ్లీ టెండర్లు ఆహ్వానించే కసరత్తు ప్రారంభించాలన్నారు. ఏమందులు కావాలో ప్రతిపాదనలు పంపే అధికారులు వాటి నాణ్యత నిర్ధారించే కమిటీలో ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి ఈ కమిటీలో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలని ఈవో సూచించారు. రెండేళ్లకు సరిపడే మందులు ఒకే సారి కొనుగోలు చేసుకుకోవాలని ఇందుకోసం నిమ్స్, నింహ్యాన్స్  ఆసుపత్రులు అవలంభిస్తున్న విధానం అమలు చేసుకోవాలని ఈవో చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లో మందులు ఏ ధరకు సరఫరా చేసున్నారో కూడా తెలుసుకోవాలని అన్నారు.

అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, బర్ద్ ఆర్ఎమ్ఓ శేష శైలేంద్ర, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, స్విమ్స్ కొనుగోలు విభాగం అధికారులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఎర్రమ రెడ్డి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com