49 దేశాల టూరిస్టులకు మల్టిపుల్ ఎంట్రీ వీసా

- August 04, 2021 , by Maagulf
49 దేశాల టూరిస్టులకు మల్టిపుల్ ఎంట్రీ వీసా

సౌదీ: దేశంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా సౌదీ ప్రభుత్వం టూరిస్టులకు వీసా ఆఫర్ ప్రకటించింది. నిషేధిత జాబితాలో లేని 49 దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఏడాది పాటు చెల్లుబాటులో ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అంటే వీసా పొందిన నాటి నుంచి ఏడాదిలోగా ఒకటి కంటే ఎక్కువ సార్లు వీసాదారులు కింగ్డమ్ లో పర్యటించవచ్చు. 90 రోజుల పాటు సౌదీలో ఉండొచ్చు. అయితే..కోవిడ్ నేపథ్యంలో సౌదీ ఆమోదించిన వ్యాక్సిన్లలో ఒక వ్యాక్సిన్ను రెండు డోసుల పాటు తీసుకొని ఉండాలి. అలాగే కింగ్డమ్ బయల్దేరే 72 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ రిపోర్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. టూరిస్టులకు వీసా మంజూరుకు సంబంధించి ప్రత్యేకంగా https://muqeem.sa/#/vaccine-registration/home వెబ్ సైట్ ఏర్పాటు చేసినట్లు సౌదీ వెల్లడించింది. 

అర్హత కలిగిన దేశాలు...

అమెరికా,కెనడా,అన్డోరా,ఆస్ట్రియా,బెల్జియం,బల్గేరియా,క్రొయాతియా,సైప్రస్, చెక్ రిపబ్లిక్,డెన్మార్క్,ఎస్టోనియా,ఫిన్లాండ్,ఫ్రాన్స్,జర్మనీ,గ్రీస్,నెథర్లాండ్స్,హన్గేరి,ఐస్లాండ్,ఐర్లాండ్,ఇటలీ,లావతియా,లైచ్టెన్స్టెయిన్,లిథుయేనియా,లక్సెంబోర్గ్,మాల్టా,మొనాకో,మోంటెనెగ్రో,నార్వే,పోలాండ్,పోర్చుగల్,రోమానియా,రష్యా,సన్మారినో,స్లోవేకియా,స్లోవేనియా,యుక్రెయిన్,యూకే,స్విట్జర్లాండ్,స్పెయిన్, బ్రూనై,చైనా,హాంగ్ కాంగ్,కజాఖ్స్తాన్,మలేషియా,సింగపూర్, సౌత్ కొరియా,ఓషియానియా,ఆస్ట్రేలియా,న్యూ జేఅలాండ్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com