బిగ్ టికెట్ అబుధాబి డ్రాలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు
- August 04, 2021
యూఏఈ: అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో భారత వ్యక్తి జాక్‌పాట్ కొట్టాడు. మంగళవారం తీసిన ర్యాఫిల్ డ్రాలో సనూప్ సునీల్ అనే భారతీయుడు ఏకంగా 15 మిలియన్ దిర్హాములు గెలచుకున్నాడు.జూలై 13న సునీల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం.183947కు ఈ జాక్‌పాట్ తగిలింది. కాగా, భారీ మొత్తం గెలుచుకున్న సునీల్‌కు లాటరీ నిర్వాహకులు ఫోన్ చేయగా అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదట. రిచర్డ్ అనే బిగ్ టికెట్‌కు చెందిన వ్యక్తి పలుమార్లు సునీల్ మొబైల్‌కు కాల్ చేశారు. కానీ, అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని రిచర్డ్ తెలిపారు. దాంతో నిర్వాహకులు సునీల్‌కు ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదే లాటరీలో అబుధాబికి చెందిన జాన్సన్ కుంజుకుంజు అనే వ్యక్తి రెండో బహుమతి రూపంలో 1 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.జూలై 16న జాన్సన్ కొన్న లాటరీ టికెట్ నెం.122225కు ఈ భారీ మొత్తం తగిలింది.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- NDA భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!







