ఖతార్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా తెలుగు విద్యావేత్త
- August 04, 2021
దోహా: భారత సాంస్కృతిక కేంద్రం, ఖతార్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా తెలుగు విద్యావేత్త KS ప్రసాద్ నియమితులయ్యారు.ఈ మేరకు భారత రాయబార కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దాదాపు 40 ఏళ్లు గా గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి సాంస్కృతిక, భాషా పరిరక్షణ కు మాత్రమే కాకుండా వివిధ సాంఘిక, సంక్షేమ, క్రీడాభివృద్దికి నిరంతరం ఎనలేని కృషి,తోడ్పాటు అందిస్తున్న కోడూరు శివరాం ప్రసాద్ ని ఖతార్ లోని ప్రతిష్టాత్మక భారత సంస్కృతిక కేంద్రానికి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నియమించింది.
కోడూరు శివరాం ప్రసాద్ ఒక తెలుగు ఎన్నారై గా తెలుగు భాషా, సంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే దిశగా ఎన్నో ఏళ్లుగా తెలుగు కళా సమితి నీ స్థాపించి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పేలా అద్భుతమైన కార్యక్రమాలకు చేయడమే కాకుండా మరెన్నో తెలుగు సంఘాలకు సలహాదారులుగా, సభ్యుడి గా తోడ్పాటు అందించారు.
కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఎన్నో సాంఘిక,సంక్షేమ కార్య్రమాలకు కూడా తన వంతు కృషి చేశారు.గత సంవత్సరం కరోనా కాలంలో లాక్ డౌన్ లో ఇటలీ, ఖతార్ లో చిక్కుకు పోయిన భారతీయులను తమ గమ్య స్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు, దీనికి గుర్తింపు గా ఇండియన్ కమ్యూనిటీ బెనవలెంట్ ఫోరమ్ ఖతార్ వారు 2020 లో లాంగ్ టర్మ్ కమ్యూనిటీ సర్వీసెస్ లీడర్ గా ప్రత్యేక అవార్డ్ తో సత్కరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







