108వ పెట్రో స్టేషన్ను ప్రారంభించిన వొఖోద్
- August 04, 2021
ఖతార్: ఖతార్ ఫ్యూయల్ సంస్థ- WOQOD దేశంలో మరో పెట్రో స్టేషన్ను ఏర్పాటు చేసింది. లుసైల్ సిటీలోని వాటర్ ఫ్రంట్లో కొత్త స్టెషన్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. ఖతార్ లో వోఖోద్ కు ఇది 108వ పెట్రో స్టేషన్ కావటం విశేషం. లుసైల్ లో ఏర్పాటు చేసిన కొత్త స్టెషన్ 8350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. తేలికపాటి వాహనాల కోసం 6 డిస్పెన్సర్‌లతో 3 లేన్‌లను ఏర్పాటు చేశారు.లుసైల్ ప్రజలకు 24 గంటల పాటు సర్వీస్ చేయనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు దేశంలో పెట్రోల్ స్టేషన్ నెట్‌వర్క్‌ను విస్తరించాలని..అందులో భాగంగానే లుసైల్ లో కొత్త స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు వొఖోద్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ సాద్ రషీద్ అల్ ముహన్నది అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖలకు, ప్రైవేట్ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







