యూఏఈ కి వచ్చే ప్రవాసీయులకు చెక్‌లిస్ట్
- August 05, 2021
యూఏఈ: ఆగష్టు 5 నుండి ప్రవాసీయులను అనుమతిస్తున్న నేపథ్యంలో అధికారులు జారీ చేసిన ఆదేశాలు మరియు ప్రయాణికుల ఆధారంగా, నివాసితులు UAE కి తిరిగి వచ్చేందుకు సహాయపడుతుంది ఈ చెక్‌లిస్ట్..
వ్యాక్సినేషన్ వివరాలు:
వ్యాక్సినేషన్ పూర్తైన నివాసితులు మాత్రమే యూఏఈ కి వెళ్లడానికి అనుమతి ఉంది. అయితే, యూఏఈ లో వ్యాక్సిన్ రెండు డోసులు పొందినవారికి ప్రవేశం పరిమితం చేయబడింది. రెండవ మోతాదు ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు తీసుకొని ఉండాలి.
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు తప్పనిసరి. ఈ సర్టిఫికేట్లు తప్పనిసరిగా అల్హోస్న్ లేదా దుబాయ్ హెల్త్ అథారిటీ యాప్‌లలో అందుబాటులో ఉండాలి.
ICA/GDRFA ఆమోదం:
దుబాయ్‌లో జారీ చేయబడిన వీసాలను కలిగి ఉన్నవారికి 'జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ అఫైర్స్' (GDRFA) నుండి ఆమోదాలు తప్పనిసరి. అన్ని ఇతర ఎమిరేట్స్‌లో జారీ చేసిన వీసాల కోసం, ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ICA) నుండి అనుమతులు తీసుకోవాలి. ఆమోదం పొందడానికి పాస్‌పోర్ట్‌ల కాపీలు, ఎమిరేట్స్ ఐడిలు, వీసా పేజీలు, వ్యాక్సిన్ సర్టిఫికేట్లు (వర్తిస్తే) మరియు పిసిఆర్ పరీక్ష ఫలితాలు అవసరం.
దుబాయ్ వీసాదారులు ఈ లింక్ ద్వారా https://smart.gdrfad.gov.ae/Smart_OTCServicesPortal/ReturnPermitServiceForm.aspx ఆమోదం పొందవచ్చు.
ఇతర ఎమిరేట్ వారు ఈ లింక్ ద్వారా https://smartservices.ica.gov.ae/echannels/web/client/guest/index.html#/registerArrivals ఆమోదం పొందవచ్చు.
PCR పరీక్షలు
బయలుదేరిన తేదీ నుండి 48 గంటలలోపు నిర్వహించిన PCR పరీక్ష లో నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి. పరీక్ష తప్పనిసరిగా గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా నిర్వహించి ఉండాలి మరియు QR కోడ్ కలిగి ఉండాలి. విమానం ఎక్కే ముందు ప్రయాణికులు కూడా త్వరిత PCR పరీక్ష చేయించుకోవాలి. యూఏఈ లోని విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, వారు మరోసారి పిసిఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
విమానాశ్రయానికి ముందుగా చేరుకోవడం:
ప్రయాణ విధివిధానాల కారణంగా, ప్రయాణికులు బయలుదేరడానికి కనీసం ఆరు గంటల ముందు తమ విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









