తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 07, 2021
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,05,201 శాంపిల్స్ పరీక్షించగా… 569 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 657 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,957 కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,36,552 కి పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 3,823 మంది మృత్యువాతపడ్డారు.. ప్రస్తుతం 8,582 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. తెలంగాణలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 98.08 శాతంగా ఉంటే.. భారత్‌లో 97.34 శాతంగా ఉందని కోవిడ్ బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.
తాజా వార్తలు
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!
- భద్రతా దళాల అప్రమత్తతను ప్రశంసించిన సౌదీ మినిస్టర్..!!
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్









