బహ్రెయిన్ చిన్నారుల్లో పెరుగుతున్న డయాబెటిస్
- March 12, 2016
బహ్రెయిన్‌లో డయాబెటిస్ కేసులు ఆందోళకరమైన స్థాయిలో పెరుగుదల నమోదు చేస్తున్నాయి. ఇందులోనూ చిన్న పిల్లలు డయాబెటిస్ బారిన పడుతుండడం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 1500కి పైగా పెరిగినట్లు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ (ఎస్‌సిహెచ్) ప్రెసిడెంట్ మరియు బహ్రెయిన్ డయాబెటీస్ సొసైటీ (బిడిఎస్) ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా చెప్పారు. బిడిఎస్ ఏర్పాటు చేసిన అరబ్ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న పెషెంట్ల కుటుంబాలు ఈ కాన్ఫరెన్స్‌కి హాజరయ్యాయి. పిల్లల్లో డయాబెటీస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందనీ అలాగే అధిక బరువు, అనారోగ్యకరమైన ఆహారశైలి, ఏమాత్రం శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటీస్ పెరుగుదలకు కారణమని నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







