రీ-ఎంట్రీ కోసం మానవీయ మినహాయింపుకై ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

- August 09, 2021 , by Maagulf
రీ-ఎంట్రీ కోసం మానవీయ మినహాయింపుకై ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

యూఏఈ: రెడ్ లిస్ట్ దేశాల్లో చిక్కుకుపోయి, యూఏఈకి తిరిగి రావాలనుకునే వలసదారులు, మానవీయ మినహాయింపు కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ (ఐసిఎ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ పోర్టల్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. విదేశాల్లో రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న చాలామంది, యూఏఈకి తిరిగొచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. తమ కుటుంబ సభ్యులు యూఏఈలో వుండటంతో, వారికి దూరంగా వుండాల్సి రావడం వలసదారులకు చాలా చాలా కష్టమైన, బాధాకరమైన వ్యవహారం. కుటుంబంతో తిరిగి కలిసేందుకోసం మానవీయ మినహాయింపును కోరేందుకు పెద్ద సంఖ్యలో వలసదారులు సిద్ధంగా వున్నారు. అరోహా ట్రావెల్స్  నిర్వాహకులు రషీద్ అబ్బాస్ మాట్లాడుతూ, ప్రయాణీకుల తరఫున అప్లికేషన్ పూర్తి చేస్తే, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులూ వుండవని తెలిపారు. ఆగస్ట్ 4 నుంచి కనీసం రెండు కుటుంబాల్ని అలా తిరిగి యూఏఈ వచ్చేందుకు తాము సహకరించినట్లు చెప్పారు. అన్ని ప్రీ-ట్రావెల్ నిబంధనలు ఈ కేసులో వర్తిస్తాయి. స్వదేశంలో వ్యాక్సినేషన్ పొందడం, లేదా పొందకపోవడం వంటివాటి విషయంలోనే చిన్నపాటి వెసులుబాటు అని పేర్కొన్నారు డేరా ట్రావెల్ మరియు టూరిస్ట్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ టి.పి. సుధీష్. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నైజీరియా, నేపాల్ మరియు యుగాండా దేశాల్లో చిక్కుకుపోయినవారికి ఇది వర్తిస్తుంది. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం పూర్తి వ్యాక్సినేషన్ పొందిన రెసిడెన్స్ వీసా కలిగినవారు (రెడ్ లిస్ట్ దేశాల్లో వుండిపోయినవారు) దేశంలోకి తిరిగి రావొచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, హెల్త్ కేర్ వర్కర్స్ సహా టీచర్లు, స్టూడెంట్స్, ఎక్స్‌పో 2020 కార్మికులు, మెడికల్ ఎగ్జంప్షన్ కేసులు, హ్యమానిటేరియన్ కేసులను ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధన నుంచి ప్రత్యేక మినహాయింపు పొందుతున్నారు. అయితే, ప్రీ ట్రావెల్ అప్రూవల్స్ మాత్రం సంబంధిత ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ నుంచి పొందడం తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com