దుబాయి ఎన్నారై మహిళకు 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డు
- March 12, 2016
దుబాయిలోని ప్రవాస భారతీయ సామాజిక సేవకురాలు శ్రీమతి అరవపల్లి వసుధ గుప్త 'ప్రవాసి ప్రసిద్ధ మహిళ' అవార్డుకు ఎంపికయ్యారు.
ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (అవోపా), హైదరాబాద్ శాఖ వారు వివిధరంగాల్లో విశేష సేవలందించిన మహిళలను 'ప్రసిద్ధ ఆర్య వైశ్య మహిళ' అవార్డులకు ఎంపికచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఆదివారం 13 మార్చి 2016 న ఉ.10 గం. లకు హైదరాబాద్ లోని కాచిగూడ వైశ్య హాస్టల్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు.
దుబాయిలోని వాసవి యూత్ ఎన్నారై అసోసియేషన్ లో వసుధ గుప్త చురుకైన సభ్యురాలు. గత 10 ఏళ్లుగా ఆమె దుబాయిలో నివసిస్తున్నారు. భారతీయ సంస్కృతి గురించి ఆమె 'ప్రజ్ఞ' అనే తరగతులను నిర్వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రవాసులకు ఆమె సహాయం చేస్తుంటారు.
దుబాయ్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు సహాయం, సలహాల కోసం వసుధ గుప్త వాట్సప్ నెంబర్: +97150 9582549 ఇ-మెయిల్: [email protected] కు సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









