ప్రభుత్వం తప్పకుండా ఏడాదిలో ఖాళీలన్నీ భర్తీ ...

- March 12, 2016 , by Maagulf
ప్రభుత్వం తప్పకుండా ఏడాదిలో ఖాళీలన్నీ భర్తీ ...

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఖాళీల భర్తీపై దృష్టి పెట్టారని, ఏడాదిలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్‌ హామీనిచ్చారు. శనివారం సభలో స భ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆవిర్భావమే నియామకాల ఆధారంగా జరిగిందన్నారు. ముఖ్య మంత్రిగా కెసిఆర్‌ బాధ్యతలు స్వీకరించగానే వీటిపై దృష్టిపెట్టి ఖాళీల అంశంపై అన్ని శాఖలకు లెక్కలు లేఖలు రాశారన్నారు. శాఖల నుండి మొత్తం 56,150పోస్టులకు సంబంధించి లేఖలు వచ్చాయని, వీ టిలో 18,423 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. తమకు డబ్బుల కోణం లేదని, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నదన్నారు.
ప్రభుత్వం తప్పకుండా ఏడాదిలో ఖాళీలన్నీ భర్తీ చేస్తుందన్నారు. ఆర్టీసిలో 3950మందిని పర్మినెంట్‌ చేశామని, సింగరేణి కాలరీస్‌లో 4500ఖాళీలు ఇప్పటికే భర్తీ చేశా మన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీలను కూడా భర్తీ చేయనున్నా మన్నారు.ఖాళీలే కాకుండా ప్రభుత్వం కొత్తగా 16వేల ఉద్యోగాలను సృష్టించిందన్నారు. రాష్ట్రంలో విభజన తర్వాత మొత్తం 5.23లక్షల ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, ఇందులో 4.15 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. 1.07లక్షల పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మొదట గుర్తించామన్నారు. ఇప్పటివరకు విభజన పూర్తయిన శాఖల నుండి వచ్చిన లేఖల ఆధారంగా 56,150పోస్టులు భర్తీకి అనుగుణంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ లన్నీ నెరవేరుస్తుందని, చెప్పని పనులు కూడా చేస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com