దేశ వ్యాప్తంగా 'ట్రి కోలర్' 25 ప్రాజెక్టులు
- August 12, 2021
హైదరాబాద్: ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ల నిర్మాణానికి దేశవ్యాప్తంగా పేరుగాంచిన ‘ట్రి కోలర్’ గ్రూప్ 25 ప్రాజెక్టులను చేపట్టింది. 2010 సంవత్సరంలో కంపెనీ ట్రైకలర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన కార్పొరేట్ కార్యాలయంతో హైదరాబాద్లో స్థాపించబడింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పాట్నా ,దర్బంగా, బెంగుళూరు, ముంబాయిలలో పలు ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ సందర్భంగా ‘ట్రి కోలర్’ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ హైటెక్స్ లో బిజినెస్ కాన్ క్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చందన్ కుమార్ జా మాట్లాడుతూ 2010 నుంచి తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 20 రెసిడెన్షియల్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. 2016లో ‘ట్రి కోలర్’ గ్లోబల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించడంతో పాటు 2017లో అక్షర ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా గ్యాన్ భారతి హైస్కూల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 2017లో శ్రీ వేదాంతా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హాస్పిటల్ అండ్ క్రిటికల్ హెల్త్ కేర్ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. అదే సంవత్సరంలో ‘ట్రి కోలర్’ మాన్ పవర్ సొల్యూషన్స్ ప్రారంభించామని అన్నారు. పదేళ్లలో 20 ఓపెన్ ప్లాట్లు ప్రాజెక్టులను పూర్తి చేసిన తమ సంస్థ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నం లలో ప్రాజెక్టులను చేపట్టినట్లు వివరించారు.రియల్ ఎస్టేట్ రంగంలో ‘ట్రి కోలర్’ నాణ్యమైన పాజెక్టులను సకాలంలో పూర్తి చేసి వినియోగదారులకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు గోవిందా, సునీల్ గ్రోవర్, వికల్ప మెహతా,టాలీవుడ్ నటుడు అలీ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







