ఐదు కొత్త ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ

- March 12, 2016 , by Maagulf
ఐదు కొత్త ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ

మెట్రో రైల్‌ ప్రాజెక్టును మరో ఐదు ప్రాంతాల్లో విస్తరించడం కోసం అధ్య యనం చేస్తున్నట్టు పురపాలక, ఐటీ, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. ఇప్ప టికే పనులు నడుస్తున్న ప్రాంతాల్లో కాకుండా మరో ఐదు ప్రాంతాల్లో మెట్రో రైల్‌ మార్గం కోసం లీ అసో సియేషన్‌ సంస్థతో అధ్యయనం చేస్తు న్నట్టు తెలిపారు. వీటిలో మియాపూర్‌ నుంచి పటాన్‌చెరువు, ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌, నాగోల్‌ నుంచి శంషా బాద్‌, తార్మాక నుంచి ఈసీఐఎల్‌ చౌరస్తా, రాయ దుర్గం నుంచి శంషాబాద్‌ వరకు మెట్రోరైల్‌ మార్గాన్ని వేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.లీ అసోసియేషన్‌ అధ్యయన నివేదిక రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటికే 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్‌ మార్గం ఉన్నందున పాత బస్తీలో మరో 5 కిలోమీటర్ల మేరకు వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అయితే దానిపై సాధ్యా సాధ్యాలను చర్చించి నిర్ణయం తీసుకుంటా మని ఎంఐఎం సభ్యుల ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. త్వరలోనే పాతబస్తీ ప్రజాప్రతి నిధులు, మెట్రోరైల్‌ గుత్తేదార్లు, అధికారులతో సమా వేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటా మన్నారు. భువనగిరి వరకు మెట్రోరైల్‌ మార్గాన్ని పొడిగించా లని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి కోరగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు యాదాద్రి వరకు ఎంఎంటిఎస్‌ను కొనసాగించడానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చారని తెలిపారు. యాదా ద్రి పుణ్యక్షేత్రంతోపాటు, వరంగల్‌ వెళ్లే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో భువనగిరి వరకు మెట్రోరైల్‌ మార్గం వేయడంపై ఆలోచన లేదని మంత్రి కెటిఆర్‌ తెలిపారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో చెత్తను తొలగించడం కోసం ప్రతి ఇంటికి 12 లీటర్ల ప్లాస్టిక్‌ చెత్త డబ్బాలను సరఫరా చేశామని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. తడి, పొడి చెత్తను వేరే వేరుగా సేకరించడం కోసం డ్రైవర్‌ కం యజ మాని(డీసీవో) పథకంలో స్వచ్ఛ్‌ ఆటో టిప్పర్లను సమ కూర్చామన్నారు. ప్రధాన రోడ్లను శుభ్రం చేయడం కోసం బీవోవో మెకానిజం క్రింద 18 యంత్రాలను జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉప యాగిస్తున్నట్టు తెలిపారు. రూ. 291,57 కోట్లతో జీహెచ్‌ఎంసీకి అవసరమైన వాహనాల కొనుగోలు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మండలిలో స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com