కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలం పొడిగింపు

- August 12, 2021 , by Maagulf
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పదవీ కాలం పొడిగింపు

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్కుమార్‌ భల్లా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరో ఏడాది పాటు ఆయన సర్వీసును పొడిగిస్తూ పర్సనల్‌ మినిస్ట్రీ(సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ) గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. అజయ్ భల్లా సర్వీసు పొడిగింపునకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. వాస్తవానికి ఆయన గతేడాది నవంబర్‌తో తన సర్వీసును పూర్తి చేసుకొని పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే గతేడాది అక్టోబర్‌లో కూడా అజయ్ భల్లా పదవీ కాలాన్ని ఇదేవిధంగా ఈ ఏడాది అగస్టు 22 వరకు పొడిగించారు. అసోం- మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి అజయ్ భల్లా కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా 2019, ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com