సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- August 12, 2021
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2439 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వారిని ఏఆర్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాల్లోకి తీసుకుంటారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే ఈ నియామకాలు చేపట్టడం విశేషం. ఈ వాక్ఇన్ ఇంటర్వ్యూ లు 2021 సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 15 మధ్య నిర్వహిస్తారు. అయితే, కేవలం రిటైర్డ్ సీఏపీఎఫ్, సాయుధ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులకు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అది కూడా పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్సైట్ ww.crpf.gov.in ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. విభాగాల వారీ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర బలగాల్లో మొత్తం 2439 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్)లో 156, బీఎస్ఎఫ్లో 365, సీఆర్పీఎఫ్లో 1537, ఐటీబీపీలో 130, ఎస్ఎస్బీలో 251 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత ప్రమాణాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా CAPF, AR వంటి సాయుధ దళాల్లో పనిచేసిన రిటైర్డ్ సిబ్బంది అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 62 ఏళ్లకు మించకూడదు.
ఇంటర్వ్యూలో గుర్తించుకోవాల్సిన అంశాలు
వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరయ్యే సందర్బంలో అభ్యర్థులు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంటర్వ్యూకి తప్పనిసరిగా వారి ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాలి. రిటైర్మెంట్ సర్టిఫికేట్, డిగ్రీ మెమో, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇటీవలి 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వంటివి అందజేయాలి. ఇంటర్వ్యూలో అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి ఆ తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు. వీటి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. కాగా, ఎంపికైన అభ్యర్థులకు వేతనం మాత్రమే లభిస్తుంది. వారికి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ, మెడికల్ అటెండెన్స్ ట్రీట్మెంట్, సీనియారిటీ, ప్రమోషన్ వంటి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







