అల్ దహిరా గవర్నరేట్లో ప్రవాసీయులకు నో వ్యాక్సిన్

- August 13, 2021 , by Maagulf
అల్ దహిరా గవర్నరేట్లో ప్రవాసీయులకు నో వ్యాక్సిన్

ఒమన్: అల్ దహిరా గవర్నరేట్‌లోని అల్ ముహల్లాబ్ ఇబ్న్ అబి సుఫ్రా హాల్‌ వ్యాక్సిన్ సెంటర్లో దేశ పౌరులకు మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రవాసీయులకు ఈ వ్యాక్సిన్ సెంటర్లో ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఇవ్వటం లేదని వెల్లడించింది. అల్ దహిరా గవర్నరేట్‌లోని అల్ ముహల్లాబ్ ఇబ్న్ అబి సుఫ్రా హాల్‌ వ్యాక్సిన్ సెంటర్లో ప్రవాసీయులకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ ప్రకటలన వెలువరించింది. ప్రవాసీయులకు వ్యాక్సిన్ ఇచ్చే గడువును భవిష్యత్తులో ప్రకటిస్తామని, ప్రస్తుతానికి ప్రవాసీయులకు టీకాలు ఇవ్వటం లేదని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com