తాలిబన్లకు లొంగిపోయిన ప్రభుత్వ దళాలు
- August 13, 2021
ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే సంహభాగం ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు.త్వరలోనే కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న తాలిబన్లు తాజాగా కాందహార్ నగరాన్ని సొంతం చేసుకున్నారు.రాజధాని కాబుల్ తరువాత రెండో పెద్ద నగరంతో పాటుగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అభివృద్ది చెందిన నగరం కావడంతో దీనిపైనే దృష్టి పెట్టారు తాలిబన్ ఉగ్రవాదులు.అంతేకాదు, తాలిబన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది కూడా కాందహార్ నగరంలోనే కావడంతో ఇది వారికి కీలకంగా మారింది.ఆర్ధికపరమైన కార్యకలాపాలు నిర్వహించాలంటే ఈ నగరం కీలకం.ప్రభుత్వ దళాలు ఇప్పటికే తాలిబన్లకు లొంగిపోయాయి. కాందహార్‌తో పాటు,సైనిక, పరిపాలనా కేంద్రంగా ఉన్న హెరాత్ నగరాన్ని కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







