ఈ నెల 24 నుంచి బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర'
- August 13, 2021
తెలంగాణ: ఈ నెల 24 నుంచి బండి సంజయ్ చేపట్టబోయే పాదయాత్రకు 'ప్రజా సంగ్రామ యాత్ర' పేరును ఖరారు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ఈ పాదయాత్ర విజయవంతం చేసేందుకు 29 కమిటీల్ని కూడా వేశారు. 2023లో అధికారమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ప్రకటించారు. BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామిగౌడ్, ఇతర నేతలతో కలిసి ఇవాళ చార్మినార్ అమ్మవారి ఆలయం వద్ద పూజలు చేసిన తర్వాత యాత్ర పేరుపై ప్రకటన చేశారు. హుజురాబాద్ ఎన్నికల్ని డబ్బుతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. ఏపీ అక్రమంగా నీళ్లను తీసుకెళ్తున్నా ఆపే దమ్ము కేసీఆర్‌కు లేదని టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!







