గాంధీ ఆసుపత్రి, సంతోష్ నగర్ రేప్ కేసులు వట్టివే..!

- August 19, 2021 , by Maagulf
గాంధీ ఆసుపత్రి, సంతోష్ నగర్ రేప్ కేసులు వట్టివే..!

హైదరాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రెండు గ్యాంగ్‌ రేప్‌ కేసులను పోలీసులు ఛేదించారు.గాంధీ ఆస్పత్రి, సంతోష్‌నగర్‌ గ్యాంగ్‌ రేపులు జరగలేదని పోలీసులు తేల్చారు. గ్యాంగ్‌ రేప్‌లు జరగకపోయినా యువతులు కట్టుకథలు అల్లినట్లు పేర్కొన్నారు.గాంధీ ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్‌ రేప్‌ జరగలేదని.. అక్కా చెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని పేర్కొన్నారు.ఇక కల్లు తాగి చెల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిదని.. ఆ విషయాన్ని దాచిపెట్టేందుకే అక్క గ్యాంగ్‌ రేప్‌ డ్రామా ఆడిందని పేర్కొన్నారు.మరోవైపు యువతుల మానసిక స్థితి సరిగాలేదని తేల్చి చెప్పారు పోలీసులు.. మరోవైపు సంతోష్‌నగర్‌ గ్యాంగ్‌ రేప్‌ పూర్తిగా అభూతకల్పన పోలీసులు తేల్చారు. ప్రియుడి పెళ్లిచేసుకోనని చెప్పడంతో అతడిని కేసులో ఇరికించేందుకు.. ప్లాన్‌ వేయిన యువతి. తనని ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్‌ చేశారంటూ స్టోరీ అల్లినట్లు తేల్చారు. రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి రేప్‌ కథ చెప్పినట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో యువతి చెప్పింది కట్టుకథగా తేలిందని నిర్థరణ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com