యూఎస్, యూకే వీసా ఉన్న భారత విజిటర్లకు దుబాయ్ శుభవార్త
- August 22, 2021
దుబాయ్: యూఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ వీసాలు కలిగి ఉన్న భారత సందర్శకులకు శుభవార్త చెప్పింది దుబాయ్ ప్రభుత్వం. వీరికి 14 రోజుల వీసా ఆన్ అరైవల్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అమెరికా ఇచ్చే విజిటర్ వీసా లేదా గ్రీన్‌కార్డు ఉన్న భారతీయులు 14 రోజులు దుబాయ్‌లో బస చేసే వీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే యూకే, యూరోపియన్ యూనియన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసాలు ఉన్న భారత సందర్శకులకు కూడా ఇదే సౌకర్యం ఉంటుందని దుబాయ్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రయాణికులు తప్పనిసరిగా 48 లేదా 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలని తెలిపారు. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్నది ఉండాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







