16 వేల రెసిడెన్సీ, వర్క్, బోర్డర్ వయోలేటర్స్ గుర్తింపు
- August 22, 2021
సౌదీ: నిబంధనలకు విరుద్ధంగా సౌదీలో ఉంటున్న 15,900 మందిని సౌదీ ఉమ్మడి భద్రతా దళాలు గుర్తించాయి. ఆగస్ట్ 12 నుంచి 18 వరకు నిర్వహించిన వారం రోజుల తనిఖీలో పలువురు చట్టవిరుద్ధంగా కింగ్డమ్ లో ఉంటున్నట్లు తేలిందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పట్టుబడిన వారిలో రెసిడెన్సీ పర్మిట్ ముగిసిన వారు 5,436 మంది ఉండగా..బోర్డర్ సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించిన వారు 9,075 మంది, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన వారు 1,389 మంది ఉన్నారు. ఇక చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నించినందుకు 454 మందిని అరెస్టు చేశారు. వీరిలో 51% మంది ఇథియోపియన్, 45% యెమెన్ మరియు 4% ఇతర జాతీయులు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతలో, రాజ్యం నుండి చట్టవిరుద్ధంగా నిష్క్రమించడానికి ప్రయత్నించినందుకు 23 మందిని అరెస్టు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో 8,000 మందికి పైగా ప్రవాసీయులను కింగ్డమ్ నుంచి బహిష్కరించారు. ఇదిలాఉంటే..చట్టవిరుద్ధంగా ఇతరులను కింగ్డమ్ లోకి తీసుకొచ్చి ఆశ్రయం కల్పించిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడానికి సాయం చేసిన వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఒక మిలియన్ రియాల్ వరకు జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







