తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల శాసనసభలో ప్రవేశపెట్టారు..

- March 14, 2016 , by Maagulf
తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల  శాసనసభలో ప్రవేశపెట్టారు..

తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ర్టంపై దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు. ప్రజల అనేక ఆశలు, ఆకాంక్షాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామన్నారు. వాస్తవాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బడ్జెట్ ఇదే అని పేర్కొన్నారు. -రాష్ర్ట బడ్జెట్ రూ. 1,30,415.87 కోట్లు-ప్రణాళిక వ్యయం రూ. 67,630.73 కోట్లు-ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లు-రెవెన్యూ లోటు రూ. 3,318 కోట్లు-ద్రవ్యలోటు రూ. 23,467.29 కోట్లు-మిషన్ భగీరథ సృష్టికర్త సీఎం కేసీఆర్
-తెలంగాణ ఏర్పడిన 21 నెలల్లోనే బంగారు తెలంగాణకు బాటలు వేశాం-కేంద్రం నుంచి అందిన సాయం రూ. 450 కోట్లు మాత్రమే-బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు-మైనార్టీ సంక్షేమానికి రూ. 1,204 కోట్లు-ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు-ఎస్టీ సంక్షేమానికి రూ. 3,752 కోట్లు-ఆసరా పింఛన్ల కోసం రూ. 4,693 కోట్లు-కళ్యాణలక్మీ కోసం రూ. 738 కోట్లు-ప్రత్యేకాభివృద్ధికి రూ. 4,675 కోట్లు-పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు-పారిశ్రామికాభివృద్ధికి రూ. 967 కోట్లు-ఐటీ, సమాచారా శాఖకు రూ. 254 కోట్లు-పర్యాటక, సంస్కృతి రంగానికి రూ. 50 కోట్లు-మిషన్ భగీరథకు రూ. 36,976 కోట్లు-విద్యాశాఖలో ప్రణాళికేతర వ్యయానికి రూ. 9,044 కోట్లు-విద్యాశాఖలో ప్రణాళిక వ్యయానికి రూ. 1,164 కోట్లు-అగ్నిమాపక శాఖకు రూ. 223 కోట్లు-ఆరోగ్య శాఖకు రూ. 5,967 కోట్లు-వ్యవసాయంకు రూ. 6,759 కోట్లు-రాబోయే మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం-వచ్చే ఖరీఫ్ నుంచి 9 గంటల విద్యుత్-రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా ఏర్పాటుకు శ్రీకారం-మహిళా శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు-బ్రహ్మణ సంక్షేమానికి రూ. 100 కోట్లు-రహదారులు, భవనాల అభివృద్ధికి రూ. 3,333 కోట్లు-పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు-గోదావరి, కృష్ణా నదిలో రాష్ర్ట వాటా 1250 టీఎంసీలు-వంద శాతం రుణమాఫీ చేస్తాం-గత రెండేళ్లుగా సరైన వర్షపాతం లేదు.-అభివృద్ధి, సంక్షేమం కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టబోతున్నాం.-పాలమూరు ఎత్తిపోతలకు రూ. 7,861 కోట్లు.-నీటి పారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,150 కోట్లు-కాలేశ్వరం ఎత్తిపోతలకు రూ. 6,286 కోట్లు-రుణమాఫీ కేటాయింపులు రూ. 3,718 కోట్లు-స్థూల ఉత్పత్తి 11.47 శాతంగా నమోదు-స్థూల ఉత్పత్తి పెరుగుదలే అభివృద్ది కాదు-ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి-రాష్ర్టంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తాం-పండ్లు, కూరగాయాల సాగుకు హార్డికల్చర్ డెవలప్ మెంట్ కు ప్రత్యేక కార్పొరేషన్-మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం కల్పిస్తాం-ఎఫ్ఆర్బీఎం పెంచినా ఇంకా అమలు కాలేదు-రెండు విడతల రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో జమ చేశాం-నీళ్లు, నిధులు, నియామకాలు మన ఆధీనంలోకి వచ్చాయి. -ఆసరా ఫించన్లు గణనీయంగా పెంపు-హైదరాబాద్ లో మరో 4 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు-ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు-40 చోట్ల డయాలసిస్, 40 చోట్ల డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు-గ్రామాల్లోని పీహెచ్ సీ నుంచి నిమ్స్ వరకు అన్ని ఆస్పత్రుల్లో సమూల మార్పులు-రాష్ర్టంలో కొత్తగా 63 ఫైర్ స్టేషన్లు నిర్మిస్తాం-గృహ, పరిశ్రమలకు నిరాంతరాయంగా విద్యుత్-ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో కోటి ఎకరాలకు సాగునీరు-గోదావరి, కృష్ణా నదులపై కర్ణాటక, మహారాష్ర్ట 450 బ్యారేజీలు నిర్మించాయి-గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ర్ట సహకారం-ప్రాణహిత, ఇంద్రావతి నీళ్లు ఒడిసిపట్టి పంట పొలాలు నీళ్లిస్తాం-గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు రూ. 300 కోట్లు-మున్సిపాలిటీలకు రూ. 500 కోట్లు-రూ. 33,100 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం-ఖమ్మంలో మెగాఫుడ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి-కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి రూ. 140 కోట్లు-పోలీసు సిబ్బంది కోసం క్వార్టర్ల నిర్మాణానికి రూ. 70 కోట్లు-జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల నిర్వహణకు రూ. 10 కోట్లు-నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా వ్యవస్థ ప్రకాళన-

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com