ఒమన్‌లో తాజా పాలకు కొరత

- March 14, 2016 , by Maagulf
ఒమన్‌లో తాజా పాలకు కొరత

ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా తాజా పాలకు కొరత ఏర్పడింది. డిస్ట్రిబ్యూటర్స్‌ మరియు సూపర్‌ మార్కెట్‌ చైన్‌ ఆపరేటర్స్‌ ఈ పాల కొరత గురించి మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులతో రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయనీ, వాటి కారణంగా పాలు సకాలంలో చేరాల్సిన చోటకు చేరడంలేదని చెప్పారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగువుతున్నాయని వారు వివరించారు. ఇదిలా ఉండగా, ఒమన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాల కొరత ఎక్కువగా ఉంటే, యూఏఈ సరిహద్దుల్లో మాత్రం తాజా పాలు అవసరానికి మించి దొరుకుతున్నట్లు రిపోర్ట్స్‌ వెల్లడించాయి. యూఏఈ నుంచి పెద్దమొత్తంలో రోజూ ఒమన్‌లోకి తాజా పాలు వస్తుంటాయి. ఒమన్‌లో రోడ్ల పరిస్థితి బాగోకపోవడంతో ఒమన్‌లోకి ప్రవేశించి, సరిహద్దుల వద్దనే పాలు ఎక్కువగా నిలిచిపోతున్నాయి. తాజా పాల కొరతతో, ప్యాకేజ్డ్‌ మిల్క్‌తోనే వినియోగదారులు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com