దుబాయ్ నుంచి అబుదాబీకి 15 నిమిషాల్లోనే
- March 14, 2016
రవాణా రంగంలో హైపర్‌లూప్ సరికొత్త సంచలనాలకు సిద్ధమవుతోందని యూఏఈ ఫెడరల్ రటాన్స్‌పోర్ట్ అథారిటీ - ల్యాండ్ అండ్ మెరిటైమ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా ఎస్ అల్ కతీరి చెప్పారు. హైపర్ లూప్ ద్వారా గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో కార్గో మరియు ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చవచ్చునని హైపర్ లూప్ టెక్నాలజీస్ ప్రతినిథులు వెల్లడించారు. హై స్పీడ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌తో పోల్చితే ఖర్చు కూడా 62 శాతం తక్కువే అవుతుందని వారు చెప్పారు. యూఏఈ, దుబాయ్ తొలిసారిగా హైపర్‌లూప్ టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా చరిత్రకెక్కే అవకాశం ఉందని వారు వివరించారు. హైపర్ లూప్ టెక్నాలజీస్ తమ ప్రాజెక్ట్‌ని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. లాస్ వెగాస్‌లో ఈ ఏడాది దీన్ని పరీక్షించనున్నారు. యూఏఈలో 10 నుంచి 15 ఏళ్ళలోపే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుందని హైపర్‌లూప్ వెల్లడించింది. హైపర్ లూప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే దుబాయ్ నుంచి అబుదాబీకి చేరుకోవడం వీలవుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







