శేఖర్ కమ్ముల ఏమైపోయాడు !
- March 14, 2016
క్రియేటివ్ దర్శకుడుగా పేరు గాంచిన శేఖర్ కమ్ముల ఏమైపోయాడు అంటూ ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. 'హ్యాపీడేస్' సినిమా తరువాత టాప్ డైరెక్టర్స్ స్థాయికి చేరిపోయిన శేఖర్ కమ్ముల గత రెండు సంవత్సరాలుగా కనీసం ఒక్క సినిమా కూడ ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడటం అత్యంత దురదృష్టకరం అని అంటున్నారు. హీరోలకు ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా ఎదో ఒక విధంగా తట్టుకుని నిలబడుతున్న నేపధ్యంలో దర్శకులకు వరసగా రెండు పరాజయాలు వస్తే కెరియర్ ముగిసిపోతున్న నేపధ్యంలో శేఖర్ కమ్ముల పరిస్థితి కూడ అలాగే మారిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇతడి కెరియర్ ను శ్రీనువైట్ల కెరియర్ తో పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు.'ఆగడు', 'బ్రూస్ లీ' సినిమాల తరువాత శ్రీనువైట్ల పేరు చెపితే చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ఎలా ముఖం చాటేసారో ప్రస్తుతం శ్రీనువైట్ల పరిస్థితి కూడ అలాగే ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమధ్య మహేష్ బాబుతో శేఖర్ కమ్ముల సినిమా ఉంటుంది అన్న వార్తలు వచ్చాయి. 'బ్రహ్మోత్సవం' సినిమా సెట్స్ పై మహేష్ కు శ్రీనువైట్ల కథ చెప్పాడు అన్న గాసిప్పులు విపరీతమైన హడావిడి చేసాయి. అయితే మహేష్ నటించబోయే సినిమాల లిస్టులో శేఖర్ కమ్ములకు వెయిటింగ్ లిస్టులో కూడ స్థానం లభించలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ మూవీ 'కహానీ' ని 'అనామిక' గా రీమేక్ చేసిన తరువాత సైలెంట్ మూడ్ లోకి వెళ్ళిపోయిన శ్రీనువైట్ల ఆ మధ్య 'హ్యాపీడేస్' సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కూడ ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఎక్కడా శేఖర్ కమ్ముల హడావిడి కనిపించకపోవడంతో ఇతడి కెరియర్ ఇక ముగిసిపోయినట్లేనా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







