గణేష్ బందోబస్తు పై సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం
- September 02, 2021
హైదరాబాద్: రానున్న గణేష్ పండుగను పురస్కరించుకొని గణేష్ బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ ల డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీ లు, ఇన్ స్పెక్టర్లతో, ట్రాఫిక్ , సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, ఎస్ఓటీ తదితర అధికారులతో ఈరోజు సీపీ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతవరణంలో జరగాలన్నారు.ఇందులో భాగంగా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో, హైదరాబాద్ ఎం పోలీసులతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు.డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు.సీసీటీవీ ల పై దృష్టి సారించాలన్నారు.విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర డీసీపీ ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్,డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా, డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ సందీప్, ఏడీసీపీలు, ఏసీపీలు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







