ఆర్దిక పరిపుష్టి దిశగా యూఏఈ..ఈ నెలలోనే 50 జాతీయ ప్రాజెక్టులు
- September 03, 2021
యూఏఈ: కోవిడ్ సంక్షోభం తర్వాత తిరిగి పుంజుకునేందుకు చాలా దేశాలు తమకు తోచిన విధానాలతో ముందుకు వెళ్తున్నారు. ఇదే కోవలో యూఏఈ కూడా తనదైన శైలిలో అభివృద్ధికి బాటలు వేసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెలలోనే 50 జాతీయ ప్రాజెక్టులను ప్రకటించనుంది. ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ వెల్లడించారు. ఈ 50 జాతీయ ప్రాజెక్టులతో తొలి ప్రాజెక్టును ఈ నెల 5న ప్రకటించనున్నారు. ఇక అప్పటి నుంచి వరుసగా ప్రాజెక్టుల ప్రకటనలు ఉంటాయి. నెలాఖరు వరకు 50 ప్రాజెక్టుల వివరాలను ప్రకటించనున్నారు. యూఏఈ చేపట్టనున్న జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి ట్వీట్ చేసిన యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్...ఈ ఏడాది తమ ప్రభుత్వం కొత్త సీజన్ను ప్రారంభించబోతోందని, తన సోదరుడు మొహమ్మద్ బిన్ జాయెద్‌ని సంప్రదించిన తర్వాత, దేశ ఆర్ధిక రంగ పటిష్టతకు దోహదపడేలా
తాము సెప్టెంబర్లో 50 జాతీయ ప్రాజెక్టులను ప్రకటిస్తామని ట్వీట్లో స్పష్టం చేశారు. యూఏఈ ఇది లగ్జరీ సమయం కాదని, తాము ప్రపంచ దేశాలకు అనుగుణంగా తమ భవిష్యత్తును నిర్మించుకోలేమని, యూఏఈ తనకు తానుగా అభివృద్ధి వైపు అడుగులేస్తుందన్నారు. ఇదిలాఉంటే..యూఏఈ ప్రజలు తమ జ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఆర్ధిక వనరులను వినియోగించుకునేలా ప్రోత్సహించేలా తమ ప్రాజెక్టులు ఉంటాయని అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







