ఉగ్రవాదంపై పోరు, భద్రతపై ఖతార్, సౌదీ చర్చలు

- September 07, 2021 , by Maagulf
ఉగ్రవాదంపై పోరు, భద్రతపై ఖతార్, సౌదీ చర్చలు

దోహా: అరబ్ దేశాల శాంతికి, దేశ భద్రతకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఖతార్, సౌదీ నేతలు సమావేశం అయ్యారు. ఖతార్ తరపున ఆ దేశ ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్-తానీ, సౌదీ తరపున కింగ్డమ్ అంతర్గత శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులాజీజ్ అల్-సౌద్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొవటం, భద్రతా, పోలీసు రంగంలో సంస్కరణలపై పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసే మార్గాలతో పాటు ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిణామాలపై చర్చించారు.  

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com