పాకిస్థాన్ జైళ్లలో 362 మంది భారత జాలర్లు బందీలుగా
- March 15, 2016
పాకిస్థాన్ జైళ్లలో 362 మంది భారత జాలర్లు బందీలుగా ఉన్నారు. వీరిలో గుజరాత్‌కు చెందిన వారే ఎక్కువమంది ఉన్నారని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన పంజాభాయ్ వాన్ష్ అడిగిన ప్రశ్నకు మంత్రి బాబు బొకిరియా ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు పాక్ జైళ్లలో 448 మంది ఉన్నారని.. మార్చి 21న 86 మంది జాలర్లు విడుదల కానున్నారని చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో భారత జాలర్లకు చెందిన 702 బోట్లను పాకిస్థాన్ స్వాధీనం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.గత రెండేళ్లలో 124 బోట్లను పాక్ స్వాధీనం చేసుకోగా వాటిలో 57 బోట్లను తిరిగి అప్పగించిందని, మరో 22 బోట్లను త్వరలోనే వెనక్కి ఇస్తుందని బొకిరియా వివరించారు.అక్కడి జైళ్లలో ఓ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నారని, మరో వ్యక్తి కోమాలో ఉన్నారని.. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించి చికిత్స అందించాలని కాంగ్రెస్ సభ్యుడు పంజాభాయ్ కోరారు. గతంలో ఇద్దరు జాలర్లు జైల్లోనే మృతి చెందారని విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. త్వరలోనే మృతదేహాలను భారత్‌కు రప్పిస్తామని మంత్రి బొకిరియా వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







