నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్
- September 11, 2021
హైదరాబాద్: నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరి ముఖ్యంగా 2000, 500 నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు ముఠా యత్నంచింది. కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహారించి కేసును చేదించారు.

సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘నిందితుల నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, లక్ష ముప్పై వేల ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రజలందరూ అప్రమతంగా ఉండాలి. దొంగ నోట్లకి, ఒరిజినల్ నోట్లకి తేడా ఉందని అందరూ గమనించాలని..’ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







