మీడియా ముందు పెదవివిప్పని మంచు విష్ణు..కారణం ఏంటంటే..
- September 11, 2021
హీరో సాయిధరమ్ తేజ్‌ని హాస్పిటల్‌లో చూసి వచ్చేటప్పుడు మీడియాతో ఎందుకు మాట్లాడలేదో.. మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు టాలీవుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కొందరు సెలబ్రిటీలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. మంచు విష్ణు కూడా శనివారం అపోలో హాస్పిటల్‌కి వెళ్లి సాయితేజ్‌ని పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్న మంచు విష్ణుని.. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటని మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎందుకు అలా వెళ్లిపోవాల్సి వచ్చిందో.. ట్విట్టర్ వేదికగా ఆయన వివరణ ఇచ్చారు.
‘‘ప్రియమైన మీడియా మిత్రులకు
నా సోదరుడు సాయిధరమ్ తేజ్‌ను చూడటానికి నేను హాస్పిటల్‌కి వచ్చిన సమయంలో మీడియా పాయింట్‌లో మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే అతని కుటుంబ సభ్యులు మరియు అతనికి చికిత్స చేస్తున్న డాక్టర్లు కాకుండా, అతని ఆరోగ్యం గురించి వేరే ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదని నేను నమ్ముతున్నాను. అంతే తప్ప మీడియా పట్ల రూడ్‌గా ప్రవర్తించాలని మాత్రం కాదు.
తేజ్ విషయానికి వస్తే మంచి మనసున్న వ్యక్తి, మా కుటుంబానికి చాలా దగ్గరైన వ్యక్తి.. మరియు నాకు చిన్న తమ్ముడులాంటి వాడు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని మీరు, నేను, అందరం ప్రార్థిద్దాం. అదే అతడిని కాపాడుతుంది. సాయి తేజ్ త్వరగా కోలుకుంటాడు’’ అని మంచు విష్ణు ట్వీట్‌లో పేర్కొన్నారు.
To my Media family 😊 pic.twitter.com/79ifYvF1wo
— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2021
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







