నయన్ తొలిసారిగా మెగాస్టార్ తో జోడీ ...
- March 16, 2016
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై క్లారిటీ లేకపోయినా ఏదో ఒక రూపంలో ఈ సినిమాకు భారీ ప్రచారమే లభిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని, ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా శరవేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. కథ కూడా ఫైనల్ కావటంతో ఇప్పుడు నటీనటుల ఎంపిక మీద దృష్టిపెట్టారు.తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను చిన్నపాటి మార్పులతో చిరు హీరోగా రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో చిరంజీవి హీరోగా ఠాగూర్ లాంటి ఘన విజయం సాధించిన వివి వినాయక్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కథ కథనాలు కూడా ఫైనల్ అయ్యాయన్న టాక్ వినిపిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేశారు.ప్రస్తుతం సౌత్ లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా ఉన్న నయన్, ఈ సినిమాతో తొలిసారిగా మెగాస్టార్ తో జోడీ కడుతోంది. చిరు వయసు దృష్ట్యా హీరోయిన్ గా నయన్ అయితేనే కరెక్ట్ అని భావించిన చిత్రయూనిట్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరి నయన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఇప్పటికే మే నెలలో షూటింగ్ నిమిత్తం నయన్ డేట్స్ కూడా ఇచ్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







