ప్రేమఖైదీ హీరో మానసిక వికలాంగుల పాఠశాలను సందర్శించారు..
- March 16, 2016
పాతతరం సినిమా హీరో హరీష్ (ప్రేమఖైదీ) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాలలో బుధవారం ప్రత్యక్షమయ్యారు. సంస్కృతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలోని కుట్టుశిక్షణా కేంద్రానికి వచ్చిన ఆయన పక్కనే ఉన్న వికాస్ విహార్ మానసిక వికలాంగుల పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులతో కొద్దిసేపు గడిపి వారిని సంతోషపరిచారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి స్వచ్చంద సంస్థ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ప్రజాచైతన్య సమాఖ్య అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







