మ్యాగీ కి బాయ్ చెప్పిన దుబాయ్
- June 05, 2015
భారతదేశంలో మ్యాగీ నూడిల్స్ విక్రయాలను పలు రాష్ట్రాలు నిషేధించడం తెలిసిందే. నెస్లె ఇండియా కంపెనీ యాజమాన్యం మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ దెబ్బ రెండు రోజుల ముందు దుబాయ్‌లో పడింది. అక్కడ మ్యాగీ ప్యాకెట్లు విక్రయించరాదని ఫుడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ గురువారం నోటీసులు ఇచ్చింది. అయితే మ్యాగీ కంపెనీ ఏజెంట్లు లేకపోవడంతో అక్కడి మాల్స్ యాజమాన్యం సరి కొత్త ప్లాన్ వేసింది. మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను విక్రయించడానికి బంపర్ ఆఫర్లు పెట్టారు. ఇండియాలో తయారైన ఆరు ఫ్లేవర్స్ మ్యాగీ నూడుల్స్ కొన్ని నెలల క్రితం దుబాయ్ కి ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు మ్యాగీ మీద నిషేదం విధించడంతో అక్కడి మాల్స్ లో క్లియరన్స్ సేల్స్ విభాగంలో మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లు పెట్టారు. అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నామని బోర్డులు తగిలించారు. అధికారులు నిషేదం విధించినా మ్యాగీ ప్యాకెట్లను క్లియరెన్స్ సేల్స్ కింద విక్రయిస్తున్నారని దుబాయ్ లోని స్థానిక పత్రిక ఖలీజ్ టైమ్స్ బయటపెట్టింది. విషయం తెలుసుకున్న అధికారులు మాల్స్ లో సోదాలు చేసి మ్యాగీ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకుంటున్నారు. మలేషియాలో తయారైన ఆరు మ్యాగీ ఫ్లేవర్స్ మాత్రమే విక్రయించాలని, భారత్ లో తయారైన మ్యాగీ ప్యాకెట్లు విక్రయించరాదని దుబాయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ దెబ్బతో దుబాయ్ లో సైతం మ్యాగీ కథ అయిపోయింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







