బీన్స్ గ్రేవీ కర్రీ
- June 05, 2015
కావలసిన పదార్ధాలు:
- బీన్స్ ముక్కలు - 2 కప్పులు
- దాల్చిన చెక్క - 1/2 అంగుళం ముక్క
- యాలకులు - 3
- లవంగాలు - 3
- కారం - 3/4 టీ స్పూను
- నూనె - 1 1/2 టేబుల్ స్పూను
- ఉప్పు - తగినంత
గ్రేవీ కోసం:
- ఉల్లిముక్కలు - 1 కప్పు
- టమాటో ముక్కలు - 1 కప్పు
- అల్లం - అంగుళం ముక్క (సన్నగా తరగాలి)
- జీలకర్ర - 3/4 టీ స్పూను
- మిరియాలు - 4
- కరివేపాకు - 6 రెబ్బలు
- కొత్తిమీర – కట్ట
చేయు విధానం:
- బాణీలో టేబుల్ స్పూను నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించి, టొమాటొముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి.
- తర్వాత కారం వేసి ఓ రెండు నిమిషాలు వేయించి, చల్లారాక మిక్సీలో వేయాలి. వీటితో పాటు అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, ఓ కప్పు నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.
- మరో బాణీలో మిగిలిన నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఓ నిమిషం వేయించాక బీన్స్ ముక్కలు వేసి ఉప్పు చల్లాలి.
- ఓ కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి మధ్యమధ్యలో తిప్పుతూ ఉడికించాలి.
- ముక్కలు ఉడికిన తర్వాత రుబ్బిన మసాలా వేసి సిమ్ లో గ్రేవీ చిక్క బడేవరకూ ఉడికించి దించాలి.
------ వి.జానకి జ్యోతి, సింగపూర్.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







