ఇక అభిమానుల మధ్య ఐపీఎల్..2వ ఫేజ్‌లో ఫ్యాన్స్ కి అనుమతి
- September 15, 2021
యూఏఈ: కోవిడ్ భయంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ లేక వెలవెలపోయిన స్టాండ్స్ ఇక సందడిగా మారబోతున్నాయి. వీవో ఐపీఎల్ 2021 కొత్త వేదికలు క్రికెట్ అభిమానులకు స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 19 నుంచి మొదలవనున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో చెన్నై-ముంబై మధ్య జరిగే తొలి మ్యాచ్ కు దుబాయ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ కు ఫ్యాన్స్ హజరయ్యేందుకు యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. డిఫెండెబుల్ ఛాంపియన్ హోదాలో బరిలోకి ముంబై హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిల్ కోసం రేసులో నిలవగా..అపోనెంట్ చెన్నై టీం గతేడాది వైఫల్యాలను అదిమించేలా బ్రేక్ తర్వాతి చెలరేగిపోయేందుకు రెడీ అవుతున్నాయి.
ఐపీఎల్ మహా వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్న అభిమానులు..ఇక కోవిడ్ అడ్డంకులతో బేజారవ్వాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 16 నుంచి ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్ http://www.iplt20.comలో టికెట్లు కొనుగోలు చేయవచ్చు లేదా http://PlatinumList.netలో కూడా టిక్కెట్లను కొనుక్కోవచ్చు. అయితే..కోవిడ్ ప్రోటోకాల్, యూఏఈ ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే అభిమానులను అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్‌సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







