సంసద్ టీవీ ప్రారంభం..
- September 15, 2021
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా… పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాల కోసం కొత్త ఛానల్‌ను ప్రారంభించింది కేంద్రం. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పకీర్ ఓం బిర్లా, ప్రధాని మోడీ… సంసద్ టీవీని ప్రారంభించారు. ఇప్పటి వరకు లోక్‌సభ, రాజ్యసభ పేర్లతో రెండు ఛానల్స్ ఉండేవి. ఆ రెండింటినీ సంసద్ ఛానల్‌లో విలీనం చేశారు. దేశ పార్లమెంట్ వ్యవస్థలో సంసద్ టీవీ…ముఖ్యమైన చాప్టర్‌గా మిగిలిపోతుందన్నారు ప్రధాని మోడీ. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృతస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్ టీవీని ప్రారంభించారు. ఈ టీవీలో ముఖ్యంగా 4 రకాలుగా ప్రసారమవుతాయి. పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు.. పథకాలు, విధానాల అమలు, పాలన.. భారత దేశ చరిత్ర, సంస్కృతి.. సమకాలిక స్వభావంగల సమస్యలు, ఆసక్తులపై కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







