టీటీడీ పాలకమండలి.. 80కి చేరుకున్న సభ్యుల సంఖ్య..!

- September 15, 2021 , by Maagulf
టీటీడీ పాలకమండలి.. 80కి చేరుకున్న సభ్యుల సంఖ్య..!

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది.. కొత్త సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించారు.అయితే, సాంకేతికంగా టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 80కి చేరుకుంది.టీటీడీ ఛైర్మన్‌తో పాటు 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 80కి చేరుకుంది టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య.. టీటీడీ కొత్త పాలకమండలి పేర్లు ఇప్పటికే ప్రకటించగా.. ఇక, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించిన వివరాలు..

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, తాడిశెట్టి మురళి, కృష్ణ ప్రసాద్, చిక్కపల్లి సురేష్, ఒక్రిడ్జ్ ప్రసాద్, రామిరెడ్డి, రాధాకృష్ణ, అమూల్ కాలే, దుష్మన్ కుమార్ దాస్, దయ సాగర్ రెడ్డి, బీరేంద్ర వర్మ, మంజునాథ్, డాక్టర్ రామకృష్ణ, లోకనాథ్, శరవణ, రామచంద్ర మూర్తి, రంగమ్మ, దాసరి కిరణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శంభుప్రసాద్ మహంతు, రూపానంద రెడ్డి, కుమారగురు, నాగార్జున రెడ్డి, శ్రీనివాస నాయుడు, మసీమ్ బాబు, కొట్టు మురళి, సుబ్బారెడ్డి, కావేరి భాస్కర్ రావు, రవి నారాయణ, మహేశ్వర రాజు, రమేష్ శెట్టి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రవి ప్రసాద్, లల్లూ అగర్వాల్, సిద్ధార్థ లాడే, గోవిందరాజులు, ఆంజనేయులును ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com