కొత్తిమీరేలో లాభాలెన్నో...

- September 17, 2021 , by Maagulf
కొత్తిమీరేలో లాభాలెన్నో...

వంట ఏది చేసిన సరే చివర్లో కొత్తిమీర వేస్తే దానికి వచ్చే ఆ టెస్టు వేరు.. వంట చివర్లో కొత్తిమీర‌ను చిన్నగా కోసి, క‌ర్రీపై చ‌ల్లితే చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అందం, రుచి మాత్రమే కాదు కొత్తిమీర‌ వలన చాలా ఆరోగ్యం కూడా.. కొత్తిమీర తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • కొత్తిమీర తిన‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. ర‌క్తంలోని చ‌క్కెర‌స్థాయుల‌ను త‌గ్గించ‌డంలోనూ కొత్తిమీర అద్భుతంగా ప‌నిచేస్తుంది.
  • కొత్తిమీర తినడం వలన గుండెకి మంచిది. అధిక ర‌క్తపోటును కంట్రోల్‌లో ఉంచ‌డంతో పాటు కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను నియంత్రిస్తుంది.
  • కొత్తిమీర తిన‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్యలు వ‌చ్చే ప్రమాదం తగ్గుతుంది.
  • కొత్తిమీర‌లో ఉండే కాల్షియం, ఇత‌ర మిన‌రల్స్ ఎముక‌ల‌ను బ‌లంగా చేస్తాయి.
  • కొత్తిమీర‌ను ప్రతిరోజు తిన‌డం వ‌ల్ల పేగులు శుభ్రమ‌వుతాయి.దీంతో జీర్ణక్రియ మెరుగ‌వుతుంది.
  • మలబద్ధకం ఉన్నవారు కొత్తిమీర తినడం మంచిది.
  • కొత్తిమీర‌ను ప్రతిరోజు తీసుకుంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com