టి.హోంమంత్రిని కలిసిన ఉజ్బెకిస్తాన్ రాయబారి
- September 17, 2021
హైదరాబాద్: ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షోద్ అఖతోవ్ రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా ఉజ్బెకిస్తాన్ నాగరికత మరియు భారతదేశంతో సంబంధాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉజ్బెకిస్తాన్ దేశ వ్యాపార సంస్థలు వ్యాపారం చేయాలని భావిస్తున్నాయని చెప్పారు. హోంమంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అన్ని వ్యాపార సంస్థలకు చక్కటి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్ర ఐ.టి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో పలు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర గంగా-జమునా విధానాన్ని మరియు ప్రభుత్వ పథకాలను రాయబారి ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మరియు మేనేజింగ్ ఆఫీసర్ అనుపమ్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







