గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు:మేయర్ విజయలక్ష్మి
- September 17, 2021
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా విగ్రహ ప్రతిమలను నీటిలో వేసినప్పుడు కలుషితం కాకుండా జిహెచ్ఎంసి ప్రత్యేక పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. వినాయక విగ్రహ ప్రతిమలను క్రేన్ ద్వారా నిర్దేశించిన చెరువులలో వేసిన వెంటనే తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అందమైన విద్యుత్ దీపాల అలకరణలతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గంలో భక్తులకు అవసరమైన త్రాగునీరు, టాయిలెట్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఆ మార్గంలో చెత్తచెదారం, రాళ్లు, ఇతర వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు.

భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిమజ్జన ప్రక్రియ కోసం 162 గణేష్ యాక్షన్ టీమ్ ఏర్పాటు, ఈ యాక్షన్ టీమ్ లలో మొత్తం 8116 మంది సిబ్బంది నియమించడం జరిగిందని తెలిపారు. నిమజ్జనానికి వివిధ కెపాసిటిగల 330 క్రేన్ల ను ఏర్పాటు చేయగా మూడు షిప్టుల్లో సిబ్బంది పనిచేస్తారని తెలిపారు. మొత్తం 33 చెరువులు, 25 ప్రత్యేక కొలనుల్లో జరిగే నిమజ్జన ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా అన్ని విభాగాల సిబ్బందితో పాటు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. నిమజ్జనం రోజు మొత్తం 33 చెరువులలో 106 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ట్యాంక్ బండ్ లో 33 క్రేన్లు, హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ లో 11 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జన వ్యర్థాలను తొలగించేందుకు ఎక్స్ లేటర్లు 20, జె.సి.బి లు 21, మినీ టిప్పర్లు 39, 10 టన్నుల సామర్థ్యం కలిగిన 44 వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాటర్ బోర్డు ఆధ్వర్యంలో 101 ప్రాంతాల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి భక్తుల కోసం 30 లక్షల నీటి ప్యాకెట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ ద్వారా బారీకేడ్లు, వాచ్ టవర్స్, వ్యూ కట్టర్స్ ఏర్పాటు చేయనున్నారు. విపత్తులను ఎదుర్కొవడానికి నిమ్జన మార్గాల్లో అగ్నిమాపక శాఖ ద్వారా 38 ఫైర్ వెహిక్సిల్స్ తో సరూర్ నగర్, ప్రగతి నగర్, కాప్రా చెరువులలో ఒకొక్కటి చొప్పున మూడు బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టూరిజం శాఖ ద్వారా ట్యాంక్ బండ్ లో 3 బోట్స్, నక్లెస్ రోడ్ లో 2 బోట్స్ తో పాటు మరో నాలుగు స్పీడ్ బోట్స్, పది మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ శాఖ ద్వారా విద్యుత్ కు అంతరాయం కలుగకుండా నిరంతరంగా సరఫరా చేసేందుకు వివిధ ప్రాంతాల్లో 101 ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు, హుస్సేసాగర్ ప్రాంతంలో 48 ట్రాన్స్ ఫార్మర్లు, సరూర్ నగర్ లో 5 ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 41,284 వీధి దీపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









