'రానా నాయుడు' లో బాబాయ్ అబ్బాయి
- September 22, 2021
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి 'ఆచార్య' సినిమాలో కలిసి నటిస్తున్నారు. మరోవైపు నాగార్జున, నాగ చైతన్య కూడా 'బంగార్రాజు' సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక వెంకటేష్ కూడా తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'ప్రేమమ్'తో పాటు 'వెంకీ మామ' సినిమాలో కలిసి నటించారు. ఇపుడు వెంకటేష్.. తన అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి పూర్తి స్థాయిలో కలసి నటించబోతున్నారు. కానీ వీరిద్దరు కలిసి సినిమాలో కాకుండా.. నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
'రానా నాయుడు' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. గతంలో వీళ్లిద్దరు 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరనుంది. దీంతో రానా ఎంతో భావోద్వేగానికి గురవుతూ తన గురువు గారైన బాబాయితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







