ఫుజారియాలో అద్దెలు 10 శాతం పెరుగుదల

- March 16, 2016 , by Maagulf
ఫుజారియాలో అద్దెలు 10 శాతం పెరుగుదల


ఫుజారియాలో రెసిడెన్షియల్‌ యూనిట్స్‌ డిమాండ్‌కి తగ్గ విధంగా లేకపోవడంతో, లిమిటెడ్‌ రెసిడెన్షియల్‌ యూనిట్స్‌కి డిమాండ్‌ పెరిగి, తద్వారా అద్దెలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా సింగిల్‌ బెడ్‌రూమ్‌ రెసిడెన్షియల్‌ యూనిట్స్‌ ధరలు 35,000 దిర్హామ్‌లకు చేరుకుంది. అలాగే డబుల్‌, త్రిబుల్‌ బెడ్రూమ్‌ రెసిడెన్షియల్‌ యూనిట్స్‌కి కూడా డిమాండ్‌ పెరుగుతోంది. డబుల్‌ బెడ్రూమ్‌ ధరలు 45,000 నుంచి 55,000 దిర్హామ్‌ల వరకు పలుకుతుండగా, త్రిబుల్‌ బెడ్రూమ్‌ ధరలు 55,000 నుంచి 75,000 వరకు పలుకుతోందని ప్రైవేట్‌ రియిల్‌ ఎస్టేట్‌ కంపెనీ డైరెక్టర్‌ వెల్లడించారు. 2015 మొదట్లో ఫుజారియాలోని హౌస్‌ రెంట్స్‌ 10 శాతం పెరగ్గా, అక్కడినుంచి మార్కెట్‌ బ్యాలెన్స్‌డ్‌గా కొనసాగుతూ వస్తోంది. 2015 ద్వితీయార్థం నుంచి 2016 బిగినింగ్‌ వరకూ 850 అపార్ట్‌మెంట్స్‌ అందుబాటులోకి వచ్చాయని, ముందు ముందు అవసరాలకు తగ్గట్టుగా రెసిడెన్షియల్‌ యూనిట్లు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫుజారియాలో త్రిబుల్‌ బెడ్రూమ్‌ అపార్ట్‌మెంట్స్‌ అందుబాటులోకి రావాల్సి ఉంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com